: చీపురు పట్టిన కథానాయిక సమంతా
కథానాయిక సమంతా కూడా 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం చేపట్టింది. హైదరాబాదులోని ఓ పాఠశాల ఆవరణలో ఊడ్చి శుభ్రం చేసింది. ఆమెతో పాటు తన హెయిర్ స్టైలిస్ట్ కోన నీరజ, మరికొంతమంది కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని సమంత తెలిపింది. ఈ కార్యక్రమంలో తనతో పాటు పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపింది. దానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఎవరి ఇంటి వద్ద చెత్తను వారే శుభ్రం చేసుకోవాలని సూచించింది.