: అమెరికన్ వాస్తుశిల్పి గ్రిఫిన్ కథను ఒబామా, అబాట్ లకు గుర్తు చేసిన మోదీ


ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా రూపశిల్పి, స్వాతంత్రానికి పూర్వం భారత్ లో ఎన్నో కట్టడాలకు డిజైన్లను అందించిన బుర్లీ గ్రిఫిన్ ను ఒబామా, అబాట్ లకు గుర్తు చేసిన మోదీ, చివరి రోజుల్లో బుర్లీ చిత్రాలను వారికి బహుమతిగా అందించారు. బుర్లీతో భారత్ కు ఆత్మీయ అనుబంధం ఉందని మోదీ చెప్పుకొచ్చారు. అమెరికాలో పుట్టిన గ్రిఫిన్, ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాను డిజైన్ చేసి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 1937లో లక్నో యూనివర్సిటీ లైబ్రరీ హౌస్ డిజైన్ కోసం వచ్చి తనకు లభించిన 40 డిజైన్ కాంట్రాక్టులను పూర్తి చేసేందుకు ఇండియాలోనే ఉండిపోయాడు. 61 సంవత్సరాల వయసులో కింగ్ జార్జి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన అంత్యక్రియలు లక్నోలోని క్రిస్టియన్ సిమెట్రీలో జరిగాయి. ఈ విషయాలను ఒబామా, అబాట్ లతో పంచుకున్న మోదీ, గ్రిఫిన్ సమాధి చిత్రాన్ని అబాట్ కు అందించారు. మొత్తం విన్న ఒబామా, అబాట్ లు సైతం ఉద్వేగానికి లోనయ్యారని అక్కడే ఉన్న విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News