: ఇండోనేషియాలో భూకంపమే పెద్దది... సునామీ చిన్నదే!


ఇండోనేషియాలో ఈ ఉదయం వచ్చిన భూకంపం కారణంగా అతి చిన్న సునామీ అల మాత్రమే ఏర్పడిందని, దీని ప్రభావం ఏమీ ఉండదని అ దేశ వాతావరణ విభాగం ప్రకటించింది. సముద్రంలో 9 సెంటీమీటర్ల సునామీ అల పుట్టి జైలోలో అనే దీవి వైపు వెళ్లిందని, ఎటువంటి ప్రమాదమూ జరగలేదని తెలిపింది. అయితే మిగతా దీవులను ఎత్తైన అలలు తాకవచ్చని వివరించింది. కాగా 2004లో ఇదే ప్రాంతంలో ఏర్పడిన భూకంపం, ఆపై వచ్చిన సునామీ కారణంగా 12 దేశాల్లోని 2.5 లక్షల మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News