: ఎన్టీఆర్ కారణంగానే రాజకీయాల్లో ఎదిగా: కేంద్ర మంత్రి దత్తాత్రేయ
ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు కారణంగానే తాను రాజకీయాల్లో ఎదిగానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ అందించిన పౌర సన్మానాన్ని స్వీకరించిన సందర్భంగా మాట్లాడిన దత్తాత్రేయ, ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు నేతలపై రాజకీయ సంచలనాలను లిఖించిన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదగగలిగానని దత్తన్న తెలిపారు. తెలంగాణ నుంచి తొలి కేంద్ర మంత్రిగా ఎంపిక కావడం తనకు గర్వంగా ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా పనిచేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దానిని ప్రధాని మోదీ అనుమతితో నెరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.