: ప్రజలు ఆమోదిస్తే నెల్లూరును విక్రమసింహపురిగా మారుస్తా: వెంకయ్యనాయుడు
నెల్లూరు జిల్లా ప్రజలు ఒప్పుకుంటే జిల్లా పేరును విక్రమసింహపురిగా నామకరణం చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులోని స్థానిక మినీ బైపాస్ రోడ్డుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్డుగా నామకరణం చేసిన సందర్భంగా పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తామని అన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.