: ఒకే గదిలో సీఐ, మహిళా ఎస్సై... రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఎస్సై భర్త


పోలీసుల తీరుపై వివాదాలు ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. సాధారణంగా నిందితులు, కక్షిదారులతో వివాదాలు సాధారణమే, కానీ వారి వ్యక్తిగత ప్రవర్తనతో పోలీసులు ఈమధ్య వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. గజపతినగరంలో ఓ ఎస్సై ఓ యువతికి మాయమాటలు చెప్పి, గర్భవతిని చేసిన ఘటన మరువక ముందే, గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సిగపట్లు పట్టారు. అది కూడా మరవక ముందే విధులు నిర్వర్తిస్తున్నామంటూ రాజధానిలోని ఒక హోటల్ లో ఒకే గదిలో సీఐ, మహిళా ఎస్సైని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన ఘటన సంచలనం రేపుతోంది. తెలంగాణ అసెంబ్లీ బందోబస్తు కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు లకడీకాఫూల్ లోని ద్వారక హోటల్ లో రూమ్ కేటాయించారు. సీఐ స్వామి ఆయనకు కేటాయించిన ద్వారకా హోటల్ లో కాకుండా బృందావనం హోటల్ లో దిగారు. కారణం ఆ హోటల్ లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్ఐ ఉండడమే. వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మహిళా ఎస్ఐ భర్త (సునీల్) వారు బస చేసిన హోటల్ కు చేరుకుని, రాత్రి 11 గంటల సమయంలో వారిద్దరూ ఒకే హోటల్, ఒకే గదిలో ఉండడం చూసి అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. వారు వచ్చిన సమయంలో సీఐ స్వామి, మహిళా ఎస్ఐ ఒకే గదిలో ఉండడం చూసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేయడంతో తెల్లవారు జామున వారిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన డీజీపీ, దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని కరీంనగర్ ఎస్పీని ఆదేశించారు. వారిద్దరినీ సెలవుపై ఇంటికి పంపేశారు.

  • Loading...

More Telugu News