: నేటి నుంచే ఎల్పీజీ నగదు బదిలీ పథకం అమలు


ఎల్పీజీ రాయితీకి సంబంధించిన మార్పులతో నేటి నుంచి నగదు బదిలీ పథకం (డీబీటీఎల్) అమలులోకి రానుంది. ఇది దేశంలోని 11 రాష్ట్రాల్లో 54 జిల్లాల్లో అమలు చేయనుండగా, కేరళలోని 14 జిల్లాలు దీని ద్వారా లబ్ధి పొందడం విశేషం. ఈ పథకం ప్రకారం వినియోగదారులు మార్కెట్ ధరకే సిలెండర్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాయితీని వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేస్తుంది. గత జూన్ లో ప్రారంభమైన ఈ పథకం ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేయడంతో, కోర్టు ఉత్తర్వులతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎన్డీయే చేసిన మార్పులతో పథకం నేటి నుంచి అమలులోకి రానుంది. వినియోగదారుడు సిలెండర్ బుక్ చేసిన వెంటనే అతడి బ్యాంకు ఖాతాలోకి రాయితీ మొత్తం జమ అవుతుంది. ఏపీలోని 9 జిల్లాల్లో, తెలంగాణలోని మూడు జిల్లాల్లో ఈ పథకం అమలుకానుంది. ఆధార్ సంఖ్య లేని వినియోగదారులకు కూడా రాయితీ ముందస్తుగా ఖాతాలో పడుతుంది. దేశవ్యాప్తంగా 9 వేల మంది వినియోగదారులు వంటగ్యాస్ పై సబ్సిడీని వదులుకున్నట్టు అధికారులు తెలిపారు. వీరి కారణంగా 5.31 కోట్లు ఆదా అయినట్టు వారు వివరించారు.

  • Loading...

More Telugu News