: ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు జరగనున్నాయి. అలాగే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా పరీక్షలు నిర్వహించడం వల్ల ఏపీ విద్యార్థులు నష్టపోతారనే ఆందోళన విద్యాశాఖ వ్యక్తం చేసింది. కాగా, తెలంగాణలో మార్చి 9 నుంచి 27 వరకు జరగనున్నాయని ఆ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.