: ఐపీఎల్ కుంభకోణంలో ఐసీసీచీఫ్ సహా నలుగురి పేర్లు ప్రస్తావించిన సుప్రీం
ఐపీఎల్ లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా ముగ్దల్ కమిటీ నలుగురు క్రికెట్ ప్రముఖుల పేర్లను ప్రస్తావించింది. జస్టిస్ టీఎస్ థాకుర్, జస్టిస్ కలీపుల్లాలతో కూడిన ధర్మాసనం ఐసీసీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్, ఐపీఎల్ సీఈవో సుందర్ రామన్, శ్రీనివాసన్ అల్లుడు గురనాధ్ మెయ్యప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాల పేర్లను ప్రస్తావించింది. తదుపరి విచారణను నవంబర్ 24కు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ థాకూర్ తెలిపారు. ధర్మాసనం పేర్కొన్న వారి స్పందనను తెలియజేయాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన బీసీసీఐ వార్షిక సమావేశం, ఎన్నికలు వాయిదా వేయాలని ధర్మాసనం ఆదేశించింది.