: రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేస్తున్నారు: నారా లోకేష్


తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చేస్తున్న తీవ్ర ఆందోళలనపై ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆ పార్టీపై ఆయన మండిపడ్డారు. "రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారు. తెలంగాణను రౌడీలు పాలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణలో లేదు. హిట్లర్ సీఎం ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు" అని పోస్టు చేశారు. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ ఆర్థిక ఫోరమ్ లో ఏపీని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంటే, కేసీఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను రెచ్చగొట్టే పనిలో ఉందని వ్యాఖ్యానించారు. ఇది దురదృష్టకరమని లోకేష్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News