: రోహిత్ కు అభినందనలు తెలిపిన సచిన్
అంతర్జాతీయ వండే క్రికెట్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను అందుకున్న రోహిత్ శర్మను లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభినందించారు. "ఒకే వ్యక్తి రెండుసార్లు ఈ ఫీట్ ను సాధించటం చాలా ప్రత్యేకం. వరల్డ్ కప్ పోటీలకు ఆస్ట్రేలియా వెళ్లేముందు ఈ ఇన్నింగ్స్ సరైన ప్రాక్టీసు వంటిది. రోహిత్ రికార్డు పట్ల చాలా సంతోషిస్తున్నా" అన్నారు. గురువారం నాటి మ్యాచ్ లో అంతకుముందు సచిన్, సెహ్వాగ్ లు నమోదు చేసిన రికార్డులను రోహిత్ చెరిపి వేసిన సంగతి తెలిసిందే.