: 2జి స్కాంలో దయాళు అమ్మాళ్, కనిమొళిలకు వ్యతిరేక సాక్ష్యం ఇవ్వనున్న సెల్వి!
2జి స్కాంలో నిందితులుగా ఉన్న కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్, కుమార్తె కనిమొళిలకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చేందుకు ప్రాసిక్యూషన్ కరుణానిధి మరో కుమార్తె ఎస్.సెల్విని ఎంచుకుంది. ఈ కేసులో అమ్మాళ్, కనిమొళి, ఎ.రాజ, మారన్ తదితర 17 మంది విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కేసులో మొత్తం 30 మందిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా ఎంచుకోగా సెల్వి చెప్పే సాక్ష్యం కీలకమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సెల్వి కరుణానిధి పెద్ద భార్య కుమార్తె. ఈమెతో పాటు కేసు విచారణ అధికారులుగా ఉన్న రాజేశ్వర్ సింగ్, సత్యేంద్ర సింగ్, కమల్ సింగ్, ఎ.రాజ మాజీ కార్యదర్శి ఆశీర్వాదం ఆచారి, టెలికాం డిపార్టుమెంటు మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఎకే శ్రీవాస్తవ కూడా సాక్షులుగా వున్నారు.