: బంగ్లా ఖాళీచేయాలని నోటీసు ఇవ్వడం అన్యాయం: చిరంజీవి
మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఢిల్లీలో ప్రస్తుతం ఉంటున్న అధికారిక ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలంటూ నిన్న (గురువారం) కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ నోటీసు అంటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి మాట్లాడుతూ, ఇది చాలా అన్యాయమన్నారు. ఖాళీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే, తనకు ప్రత్యామ్నాయ నివాసం చూపకుండా ఇప్పుడే ఖాళీ చేయమని నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. తన పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నివాసం కేటాయించాలని కోరానని, అప్పుడు స్పందించలేదని చెప్పారు. అందుకే సరైన ఇల్లు చూపితే ఖాళీ చేస్తానని చిరంజీవి అన్నారు.