: రాజధాని మండలాల రైతులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కానున్న మండలాల రైతులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమైంది. తుళ్లూరు మండలం మందడంలో జరిగిన ఈ సమావేశానికి వచ్చిన మంత్రివర్గ ఉపసంఘానికి రైతులు ఘన స్వాగతం పలికారు. సమావేశంలో భాగంగా భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం రైతులతో చర్చలు నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో పాటు రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News