: స్పీకర్ ను కలిసిన టీటీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, మాధవరం కృష్ణారావులు కలిశారు. బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడే అవకాశం టీడీపీ ఎమ్మెల్యేలకు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. నిన్న 10 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి వారం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.