: నేపాల్ కు రోడ్డు మార్గాన వెళ్లనున్న మోదీ
ఈ నెలాఖరులో నేపాల్ లో జరగనున్న 18వ సార్క్ దేశాల సమావేశానికి ప్రధాని మోదీ రోడ్డు మార్గాన వెళ్ళాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మార్గమధ్యంలో జనక్ పూర్, లుంబిని, ముక్తినాథ్ పుణ్య క్షేత్రాలను దర్శించాలన్నది అయన అభిమతం. మోది కోరికను తీర్చేందుకు అధికారులు మూడు రోడ్డు మార్గాలను ఇప్పటికే గుర్తించారని సమాచారం. ఉత్తర ప్రదేశ్ నుంచి రెండు రూట్ లు, బీహార్ నుంచి ఒక రూట్ ను ఎంపిక చేసారు. ఏ దారిలో ప్రయాణం సాగుతుందన్నది చివరి క్షణంలోనే నిర్ణయించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. అయితే ఈ ప్రయాణం ఢిల్లీ నుంచి రోడ్డు మార్గాన సాగదు. భారత సరిహద్దు వరకు వాయు మార్గాన వెళ్లి అక్కడి నుంచి రహదారిలో వెళ్లనున్నారు. కాగా భిత్తమోడ్ నుంచి జనక్ పూర్ వెళ్ళే రహదారికి ఆఘమేఘాల మీద మరమ్మతులు చేస్తున్నారు.