: దొంగతనం కేసులో వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిందితుడు: టీడీపీ ఎమ్మెల్యే మాగంటి
వైకాపా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశ్నాపత్రాల దొంగతనం కేసులో నిందితుడైన శ్రీకాంత్ రెడ్డికి హెరిటేజ్ సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. శ్రీకాంత్ రెడ్డిపై అనేక కేసులున్నాయని... కేసుల్లో ఇరుకున్నవారు కూడా ఇతరులపై విమర్శలు చేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. పార్టీ ఆఫీస్ ను నడపలేక, మూసేసి, ఇంటి నుంచి నడిపించుకుంటున్నారని... అలాంటి పార్టీకి చెందిన నేతలు మాట్లాడితే జనాలు పట్టించుకోరని చెప్పారు. ఇదే సమయంలో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా మాగంటి విమర్శలు సంధించారు. తన అసమర్థతతో పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.