: వాయిదా తీర్మానాలు తిరస్కరణ... ప్రశ్నోత్తరాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. బీడీ కార్మికులకు రూ.1,000 భృతిపై బీజేపీ, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై సీపీఐ, ఇళ్ల క్రమబద్ధీకరణపై సీపీఎంలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. వీటిని తిరస్కరించిన స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు లేని నేపథ్యంలో సమావేశాలు ప్రశాంతంగానే సాగుతున్నాయి.