: హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులో మంటలు


హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. జనం రద్దీగా ఉండే అమీర్ పేటలోని మైత్రివనం వద్ద ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుండి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని బస్సులో మంటలను ఆర్పివేశారు. మంటలు బస్సులో పూర్తిగా విస్తరించేలోగానే ప్రయాణికులు బస్సు దిగగలిగారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గత నెలలో శంషాబాద్ సమీపంలో ఈ మాదిరిగానే ఓ బస్సులో వ్యాపించిన మంటలు క్షణాల్లో బస్సును పూర్తిగా దహించివేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News