: పెట్టుబడులకు ఏసీ స్వర్గధామం: సింగపూర్ లో చంద్రబాబు
పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సింగపూర్ పర్యటనలో ఉన్న చంద్రబాబు గురువారం ఆ దేశ ఉప ప్రధానితో పాటు మాజీ ప్రధానితోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగపూర్ సాధించిన అభివృద్ధిని చంద్రబాబు కీర్తించారు. సింగపూర్ తరహాలో అపార అవకాశాలు ఏపీలో ఉన్నాయని ఆయన వారితో అన్నారు. పెట్టుబడులతో వచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేవలం ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకే సింగపూర్ పర్యటనకు వచ్చానన్నారు. భారీ పెట్టుబడులతో ఏపీకి రావాలని ఆయన సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. భారత్ లో నమోదవుతున్న వృద్ధిని ప్రస్తావించిన చంద్రబాబు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే భారత్ ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయన్నారు.