: ఆ నాలుగు ‘డబుళ్లు’ భారత్ వే!
అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఇప్పటిదాకా నాలుగు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో తెలుగు తేజం రోహిత్ శర్మవే రెండున్నాయి. మిగిలిన రెండు టీమిండియా మాజీ సభ్యులవే. అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల వరద పారించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 2010లో డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా వన్డే క్రికెట్ లో అప్పటిదాకా ఏ ఒక్కరికీ సాధ్యం కాని ఫీట్ ను టెండూల్కర్ సాధించాడు. తర్వాత ఏడాదికే భారత డ్యాషింగ్ బ్యాట్స్ మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా డబుల్ సెంచరీని సాధిస్తే, తాజాగా తెలుగు తేజం రోహిత్ వారిద్దరి రికార్డులను వెనక్కు నెట్టేస్తూ ఏకంగా రెండు డబుల్ సెంచరీలను ఏడాది వ్యవధిలోనే అలవోకగా సాధించేశాడు. వన్డే క్రికెట్ లో ఇప్పటిదాకా నమోదైన నాలుగు డబుల్ సెంచరీలు భారత్ కు చెందిన ఆటగాళ్లవే కావడం గమనార్హం.