: సుజనా ఓ బ్రోకర్...ఆయనకు మంత్రి పదవి ఎందుకిప్పించారో చెప్పాలి: రఘువీరా
టీడీపీలో సుజనా చౌదరి ఓ బ్రోకర్ అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, సుజనాకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేతకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎంపీలు కనబడలేదా? అని ఆయన నిలదీశారు. ఏపీ కేబినెట్ లో ఉన్న నారాయణకు కనీస అవగాహన లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్న ఆయన, మంత్రి కంటే తమ ఊరి సర్పంచ్ నయమని ఎద్దేవా చేశారు. కాలేజీ బస్సుల్లో డబ్బు సంచులు మోసేందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టు ఉందని ఆయన విమర్శించారు.