: టి.అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై వారంపాటు సస్పెన్షన్


తెలంగాణ శాసనసభలో టీడీపీ సభ్యులపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు పదిమంది టీడీపీ సభ్యులను వారంపాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఎంపీ కవితపై ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అంతవరకు సభ జరిగేది లేదని స్పష్టం చేసింది. దాంతో, తెలుగుదేశం సభ్యులు తీవ్ర నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు సభలో టీడీపీ వారిపై సస్పెన్షన్ మోషన్ పెట్టారు. స్పీకర్ దాన్ని వెంటనే ఆమోదించారు. సస్పెండయిన వారిలో ఎం.గాంధీ, గోపీనాథ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి, సాయన్న, వివేకానందగౌడ్, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.

  • Loading...

More Telugu News