: నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగలో సచిన్ వ్యక్తిగత కార్యదర్శి
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత కార్యదర్శి మనోజ్ వారియా ఈరోజు నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగ వచ్చారు. ఈ సందర్భంగా సచిన్ దత్తత గ్రామాన్ని కార్యదర్శి పరిశీలించారు. ఈ నెల 16న సచిన్ గ్రామానికి రానున్న నేపథ్యంలో గ్రామస్థులతో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన క్రమంలో రాజ్యసభ సభ్యుడిగా సచిన్ కండ్రిగ గ్రామాన్ని దత్తత చేసుకున్నారు.