: ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు సంబంధం లేదు: ఈటెల
రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని.. అయితే ఈ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే పనికొస్తుందని చెప్పారు. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా రేషన్ కార్డు ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డులతో వైద్య సదుపాయం పొందేందుకు అవకాశం లేదని చెప్పారు.