: రష్యా ప్రధానితో మోదీ చర్చలు
తూర్పు ఆసియా దేశాల సదస్సులో భాగంగా రష్యా ప్రధాని మెద్వదేవ్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇప్పటికే బలంగా ఉన్న భారత్, రష్యా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరిద్దరి సంభాషణ సాగింది. రష్యాకు ఎంతో దగ్గరైన, బలమైన భాగస్వామి ఇండియానేనని ఈ సందర్భంగా మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. అత్యంత కీలకమైన రక్షణ శాఖ సహా ఎన్నో విభాగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయని ఆయన అన్నారు. రష్యాతో భారత బంధం మరింత బలపడుతుందని భావిస్తున్నట్టు మోదీ తెలిపారు.