: సింగపూర్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సింగపూర్ పర్యటనలో రెండో రోజైన గురువారం ఆ దేశ పారిశ్రామిక వేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టే ప్రధాన లక్ష్యంతో సింగపూర్ లో అడుగుపెట్టిన చంద్రబాబు, బుధవారం ఆ దేశ వాణిజ్య మంత్రితో భేటీ అయ్యారు. తాజాగా గురువారం సింగపూర్ పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా ఆయన ‘ఆంధ్రా పిలుస్తోంది’ పేరిట రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించినట్లు సమాచారం. అంతేకాక ఏపీలో ఉన్న అపార అవకాశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరారు.

  • Loading...

More Telugu News