: పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ పై అరెస్ట్ వారెంట్లు జారీ
పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. సెప్టెంబర్ లో నిర్వహించిన ఆందోళనలో భాగంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ- ఇన్సాఫ్ నేతలు, కార్యకర్తలు పార్లమెంట్ సహా ప్రభుత్వ టీవీ ఛానెల్ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ సహా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు షా మహ్మూద్ ఖురేషీ, మత గురువు తాహిరుల్ ఖాద్రీలపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.