: తిరుమలలో కుంభవృష్టి
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో, ఆలయ పరిసరాలు, దారులు జలమయమయ్యాయి. వర్షానికి చలి కూడా తోడవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండపైకి వస్తున్న వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్న కనుమ దారిలో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచించారు.