: వైయస్ హయాంలో జరిగింది... ఇప్పుడు రిపీట్ అవుతోంది: వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఏపీ రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల భూమిని లాక్కునేందుకు తెరలేచిందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాలు అవసరం లేదని, 800 ఎకరాల భూమి సరిపోతుందని తెలిపారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం 70 శాతం మంది రైతులు అంగీకరిస్తేనే భూసేకరణ చేయాలని చెప్పారు. వైయస్ హయాంలో సెజ్ ల పేరుతో 50 వేల ఎకరాలు లాక్కున్నారని, ఇప్పుడూ అలాంటి దందానే మరొకటి మొదలైందని చెప్పారు.