: టీబిల్లు ఆమోదం నాటి రహస్యాలపై పుస్తకం రాస్తున్న జైపాల్ రెడ్డి
మంచి పుస్తక ప్రియుడిగా పేరుగాంచిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇప్పుడు పుస్తకం రాసే పనిలో పడ్డారు. అది కూడా, తెలంగాణ బిల్లు ఆమోదం సందర్భంగా జరిగిన పరిణామాలు, పలువురు నేతలు వ్యవహరించిన తీరు తదితర అంశాలతో పుస్తకం రాస్తున్నారు. బిల్లు ఆమోదం పొందే క్రమంలో జరిగిన అనేక విషయాలు ప్రజలకు తెలియవని, ఎన్నో రహస్యాలు దాగున్నాయని జైపాల్ వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే పుస్తకం రాస్తే బాగుండదనే కొంత ఆలస్యం చేశానని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఈ పుస్తకం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.