: బ్రహ్మానందంలో మీకు తెలియని రెండో యాంగిల్ కూడా ఉంది!
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంను చూడగానే ఇప్పటిదాకా మనకు తెలిసింది ఒకటే... కడుపుబ్బ నవ్వుకోవడం. కానీ, ఆయనలో మరో కోణం కూడా దాగి ఉంది. అది కూడా ఆయన చెబితేనే మనకు తెలిసింది. బ్రహ్మీకి బంకమట్టితో బొమ్మలు చేయడం కూడా వచ్చు. తాజాగా బంకమట్టితో ఆయన ఒక అద్భుతమైన కళాఖండం సృష్టించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను జీవం ఉట్టిపడేలా చేసిన బ్రహ్మీ... ఆ బొమ్మకు సంబంధించిన ఫొటోలు, బొమ్మను తయారు చేస్తుండగా దిగిన ఫొటోలను తన ఫేస్ బుక్ లో పెట్టారు. దీంతో, ఆయనలో కూడా అపరిచితుడు ఉన్నాడన్న సంగతి ప్రపంచానికి తెలిసినట్టైంది.