: 'వాట్స్ యాప్'తో ఇటలీలో పెరుగుతున్న విడాకుల సంఖ్య
వాట్స్ యాప్ లో అపరిచితులతో సన్నిహితంగా ఉంటున్నారా? నిరంతరం మెసేజ్ లు పంపుతున్నారా? పెళ్లయిన వారు కూడా ఇలానే చేస్తున్నారా. అయితే మీకు తెలియకుండానే ఇబ్బందుల్లో పడ్డట్టే. ఇటలీలో అత్యంత పాప్యులర్ అయిన ఈ మెసెంజర్ వేదిక, వివాహితులు విడాకులు తీసుకునేందుకు కారణమవుతోందని 'ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్స్' అధ్యక్షుడు గియాన్ ఎట్టోర్ గస్సానీ తెలిపాడు. ఈ మేరకు లండన్ టైమ్స్ పత్రికతో మాట్లాడిన అతను, "వాట్స్ యాప్ ద్వారా మెసేజ్ లు చేస్తూ జీవిత భాగస్వాములను మార్చుకుంటున్నట్టు 40 శాతం విడాకుల కేసుల్లో తెలిసింది. ఈ విషయంలో వారి ప్రేమికులే సాక్ష్యంగా ఉంటున్నారు" అని చెప్పారు. ఇటలీలో సోషల్ మీడియా మోసాన్ని చాలా సులభంగా ప్రోత్సహిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా ఉపయోగిస్తుండటంతో... ముందు టెక్స్ట్ సందేశం, తరువాత ఫేస్ బుక్, ఇప్పుడు వాట్స్ యాప్ ద్వారా ఇలా చేస్తోందన్నారు. దాంతో, తమ లాటిన్ లవర్ ను తిరిగి తెచ్చుకునేందుకు ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఇటలీలో కుటుంబమే సమాజ మూలస్తంభంగా ఉందని, కానీ కొన్నేళ్లుగా దాడికి గురవుతోందని, ఇప్పుడు వాట్స్ యాప్ చివరి ఉపద్రవంగా మారిందన్నారు.