: మరోసారి తగ్గనున్న పెట్రోల్ ధర!
అంతర్జాతీయ చమురు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర నాలుగేళ్ల కనిష్ట స్థాయికి తగ్గటంతో దేశవాళి మార్కెట్లో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం నాటి సెషన్ లో బారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82 డాలర్లకు పడిపోయింది. దీంతో భారత్ లో పెట్రోల్ ధర 80 పైసల నుంచి 1.20 రూపాయల వరకు, డీజిల్ ధర 75 పైసల నుంచి 1.10 రూపాయల వరకు తగ్గవచ్చు. శుక్రవారం నాడు దీనిపై చమురు సంస్థలు ప్రకటన చేసే అవకాశం ఉంది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇప్పటివరకు 7 సార్లు పెట్రోల్ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే.