: కేటీఆర్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన రేవంత్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలను నామినేటెడ్ ఎమ్మెల్యేలు అన్నారని ఆరోపిస్తూ రేవంత్ ఈ నోటీసు ఇచ్చారు. క్రైస్తవ మతానికి చెందిన ఒక వ్యక్తిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నామినేట్ చేసిందని... తామంతా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని రేవంత్ మండిపడ్డారు. తమను నామినేటెడ్ సభ్యులని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సభలో తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. సభాహక్కుల నోటీసు ఇవ్వాలంటే ముందే చెప్పాలని... ఈ రోజు సమయం అయిపోయింది కాబట్టి రేపు ఇచ్చుకోవాలని హరీష్ రావు సూచించారు. దీంతో, స్పీకరుకు చెప్పే తాము నోటీసు ఇస్తున్నామని టీడీపీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంలో, సభలో గందరగోళం చెలరేగింది.