: మాపై దాడులు చేయడమే కాకుండా, ఎదురు కేసులు కూడా పెడుతున్నారు: జగన్
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలపై దాడులు పరిపాటిగా మారాయని ఆ పార్టీ అధినేత జగన్ ఆరోపించారు. తమ పార్టీ నేతలపై దాడులు చేయడమే కాక, ఎదురు కేసులు కూడా పెడుతున్నారని మండిపడ్డారు. ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైకాపా కార్యకర్త పుట్టా దస్తగిరిని ఈ రోజు జగన్ పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ, తమపై జరుగుతున్న దాడులపై ఎన్నిసార్లు ప్రశ్నించినా, ఫలితం లేదని అన్నారు. ప్రభుత్వ పాలనలో రాజ్యాంగేతర శక్తుల ప్రమేయం ఎక్కువయిందని చెప్పారు.