: రేపు ఉదయం 10 గంటల వరకు వాయిదా పడ్డ టి.శాసనసభ


తెలంగాణ శాసనసభ రేపు ఉదయం 10 గంటల వరకు వాయిదా పడింది. నిజామాబాద్ ఎంపీ కవిత రెండు ప్రాంతాల్లో సమగ్ర సర్వేకు వివరాలు ఇచ్చారన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ వ్యాఖ్యలు ఈ రోజు సభను రక్తి కట్టించాయి. ఈ కామెంట్లను ఖండించిన అధికారపక్ష సభ్యులు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ సభ్యులు అతని ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో, సభలో మరోసారి గందరగోళం తలెత్తింది. ఈ నేపథ్యంలో, స్పీకర్ మధుసూదనాచారి సభను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News