: ‘మహా’ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా శివసేన ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే!


మహారాష్ట్ర అసెంబ్లీలో అధికార పక్షంలో కొనసాగుతుందనుకున్న శివసేన ప్రతిపక్షంలో కూర్చుంది. నిన్నటిదాకా ఫడ్నవీస్ సర్కారులో చేరుతుందనుకున్న ఆ పార్టీ రాత్రికి రాత్రి తన నిర్ణయాన్ని మార్చేసుకుని విపక్ష హోదాకే మొగ్గుచూపింది. ఇప్పటికే సభలో ఆ పార్టీ నేతగా ఎన్నికైన ఏక్ నాథ్ షిండే సభలో ప్రతిపక్ష నేతగా పదవి చేపట్టారు. విశ్వాస పరీక్షలో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుకు మద్దతివ్వబోమన్న శివసేన ప్రతిపక్షంలో కూర్చుంటామని బుధవారం అసెంబ్లీ సమావేశాలకు కొద్దిసేపటి ముందుగా ప్రకటించింది. అంతేకాక ఫడ్నవీస్ సర్కారు ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సర్కారుకు వ్యతిరేకంగా ఓటేసింది. అయితే అప్పటికే బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవీస్ సర్కారు గట్టెక్కింది. దీంతో గత సభలో ప్రతిపక్షంలో కూర్చున్న శివసేన ఈ దఫా కూడా అందులోనే సెటిలైపోయింది.

  • Loading...

More Telugu News