: కరెంటు షాక్ తో అత్తాకోడళ్ళు మృతి


కౌలుకు తీసుకున్న పొలానికి వెళుతున్న అత్తాకోడళ్లను ఆ పొలానికి వేసిన ఇనుప కంచే బలితీసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో జరిగిన ఈ సంఘటనలో బాదరాల లక్ష్మి (50), రవళిక (25) అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం పొలానికి వెళ్ళాలన్న తొందరలో కంచెను దాటుతుండగా విద్యుత్ షాక్ కు గురై లక్ష్మి, ఆమెను కాపాడే ప్రయత్నంలో రవళిక విద్యుదాఘాతానికి గురై మరణించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ నుంచి గృహావసరానికి విద్యుత్ ను మళ్లించేందుకు ఏర్పాటు చేసిన తీగల కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News