: నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు బంద్!


ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నేడు నిలిచిపోతున్నాయి. వేతన సవరణతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం బ్యాంకుల సిబ్బంది నేడు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో మంగళవారం జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమ్మె బాట పట్టడం మినహా తమకు మరో మార్గం కనిపించలేదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ కన్వీనర్ మురళి తెలిపారు. తాము డిమాండ్ చేస్తున్న వేతన సవరణను 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గించుకున్నా ఐబీఏ స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 11 శాతం మేర వేతనాలను పెంచేందుకు ఐబీఏ ప్రతిపాదించిందని, దీంతోనే తాము సమ్మె బాట పట్టక తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల సమ్మెతో నేడు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. సాధారణ చెక్కుల క్లియరెన్స్ తరహా సేవలు కూడా స్తంభించనున్నాయి.

  • Loading...

More Telugu News