: చంద్రబాబుకు సింగపూర్ లో ఘన స్వాగతం!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందానికి సింగపూర్ లో ఘన స్వాగతం లభించింది. సింగపూర్ లోని తెలుగు ప్రజలు బుధవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఏపీ రాజధాని నిర్మాణంలో సింగపూర్ నమూనాను అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనకు మంగళవారం రాత్రి బయలుదేరివెళ్లిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్న చంద్రబాబు, అక్కడ జరగనున్న దక్షిణాసియా సదస్సులో ప్రత్యేక అతిథి హోదాలో కీలకోపన్యాసం చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, సీనియర్ అధికారులతో పాటు సీఐఐ ప్రతినిధి బృందం కూడా వెళ్లింది.

  • Loading...

More Telugu News