: రోజూ గ్లాసు వైన్ తో హృద్రోగాలకు చెక్ పెట్టొచ్చు, అయితే..!


మద్యం ఆరోగ్యానికి హానిచేస్తుందా? మేలు చేస్తుందా? అన్న దానిపై ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. గోథెన్ బర్గ్ వర్శిటీ పరిశోధకులు తాజాగా వైన్ విషయమై పలు విషయాలను వెల్లడించారు. రోజూ గ్లాసు వైన్ తాగితే హృదయ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. అయితే, ప్రత్యేకమైన జన్యువులు ఉన్నవారికే వైన్ ఈ విధమైన రక్షణ కలిగిస్తుందని వారంటున్నారు. ఈ ప్రత్యేక జన్యు క్రమం ఉన్న వ్యక్తులు ప్రతి 20 మందిలో ముగ్గురే ఉంటారట. జన్యు ఉత్పరివర్తనం ఉన్న వ్యక్తులే ఆల్కహాల్ ద్వారా ప్రయోజనాలు పొందుతారని వర్శటీ బృందం పేర్కొంది.

  • Loading...

More Telugu News