: ప్రపంచ చాంపియన్ షిప్ లో విషీ నవ్వాడు!
భారత నెంబర్ వన్ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మోముపై చిరునవ్వులు విరబూశాయి! రష్యాలో్ని సోచీ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ మూడో రౌండ్ లో నెగ్గడమే అందుకు కారణం. డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ (స్వీడన్) తో పోరులో విషీ పోరాటపటిమ కనబరిచాడు. మూడో గేమ్ అనంతరం ఇరువురి ఖాతాలో 1.5 పాయింట్లు ఉన్నాయి. తొలి గేమ్ డ్రాగా ముగియగా, రెండో గేమ్ కార్ల్ సన్ వశమైంది. మూడో గేమ్ లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 34 ఎత్తుల్లో చాంపియన్ ఆటకట్టించాడు.