: 'చందమామ'కు గురిపెట్టిన ఇస్రో


మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) విజయవంతం కావడం ద్వారా భారత్ ఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది. ప్రపంచంలో, తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలో ప్రవేశించిన దేశంగా ఖ్యాతి దక్కించుకుంది. అరుణగ్రహంపైకి విజయవంతంగా యాత్ర చేపట్టిన తొలి ఆసియా దేశంగానూ చరిత్రకెక్కింది. ఇంతటి ఘనతకు ఇస్రో శాస్త్రజ్ఞుల అంకితభావం, పట్టుదలే కారణం. మామ్ విక్టరీతో ఉత్సాహం పొంగిపొర్లుతోన్న ఇస్రో చంద్రుడిపైకి రోవర్ ను పంపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిపై ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ మాట్లాడుతూ, చంద్రుడిపైకి ఓ రోవర్ తో పాటు శాటిలైట్ ను కూడా ప్రయోగించాలని భావిస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు చేపట్టాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. చంద్రుడిపైకి ప్రయోగించే శాటిలైట్ ద్వారా సూర్యుడి గురించి అధ్యయనం చేస్తామని చెప్పారు. సూర్యుడికి, భూమికి మధ్య ఉండే లాగ్రేంజియన్ పాయింట్ వద్ద ఈ శాటిలైట్ నిలుపుతామని ఇస్రో చైర్మన్ వివరించారు. రెండు భారీ వస్తువుల మధ్య ఉండే ఉమ్మడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా, వాటిని చుట్టి వచ్చేందుకు అవసరమయ్యే అభికేంద్ర బలం ఏ పాయింట్ వద్ద అయితే ఏర్పడుతుందో దాన్ని లాగ్రేంజియన్ పాయింట్ అంటారు.

  • Loading...

More Telugu News