: ఒకే వేదికపై కనువిందు చేయనున్న సూపర్ స్టార్లు
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే వేదికపై దర్శనమిస్తే అభిమానులకు కన్నుల పండుగే. గోవాలో ఈ నెల 20న జరిగే 45వ భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వీరిద్దరూ విచ్చేస్తున్నారు. ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ చిత్రోత్సవానికి అమితాబ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, రజనీకాంత్ కు ప్రత్యే సెంటినరీ అవార్డు ఇస్తున్నామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ చెప్పారు.