: నేను దేవుడిని కాను... సామాన్యుడినే: సచిన్


తన ఫ్యాన్స్ కు సచిన్ టెండూల్కర్ ఓ దేవుడి కిందే లెక్క! అయితే, తాను దేవుడిని కానని సచిన్ అంటున్నాడు. సామాన్య సచిన్ ను అని స్పష్టం చేశాడు. బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను సాధారణమైన వ్యక్తినని, మైదానంలో ఎన్నో తప్పులు చేశానని సచిన్ పేర్కొన్నాడు. ప్రజలు తనపై ఇంతలా అభిమానం చూపడాన్ని అదృష్టంగా భావిస్తానని, దేవుడు తనపై కరుణ చూపాడని అనుకుంటానని తెలిపాడు. రిటైర్మెంట్ తర్వాత బిజీ అయ్యానని, జీవితంలోని మరో పార్శ్వం గురించి తెలుసుకుంటున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News