: తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోకి సచిన్ 'ఆత్మకథ'


'ప్లేయింగ్ ఇట్ మై వే' పేరుతో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రాసిన ఆత్మకథ పుస్తకం త్వరలో దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోకి అనువాదం కానుంది. ఈ మేరకు పుస్తక ప్రచురణకర్తలు నిర్ణయం తీసుకున్నారు. పలువురి నుంచి వచ్చిన విజ్ఞాపనల మేరకే పలు భాషల్లో ప్రచురించాలనుకుంటున్నామని ఈ పుస్తక సహ ప్రచురణకర్త అయిన 'హచెట్ ఇండియా' తెలిపింది. ఇందుకోసం దేశంలోని పలు ప్రాంతాల పబ్లిషర్స్ తో మాట్లాడుతున్నట్టు హచిట్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో, మరాఠీ, హిందీ, గుజరాత్, మలయాళం, అస్సామీ, తెలుగు, బెంగాలీలో సరైన సహ ప్రచురణకర్తల కోసం చూస్తున్నామని హచెట్ ఇండియాకు చెందిన పౌలొమి ఛటర్జీ తెలిపారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ పుస్తకాలను విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే అమ్మకాల్లో ఈ పుస్తకం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News