: వాజపేయిని కలసి ఆశీస్సులు తీసుకున్న గోవా కొత్త సీఎం


గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ పార్టీ ఢిల్లీ అధిష్ఠానంను కలుసుకున్నారు. అదే సమయంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయిని కూడా కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ముందు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం 89 ఏళ్ల పార్టీ ప్రముఖ నేత వాజపేయిని కలసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. "అనారోగ్యం కారణంగా ఆయనను చూసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. దాంతో, ఇటీవలే నేను సీఎంగా బాధ్యతలు చేపట్టానని చెప్పాను. అందువలన, వాజపేయిని దర్శించుకోవాలని, ఆయన పాదాలకు నమస్కరించాలనుకుంటున్నానని తెలిపాను. నా విజ్ఞప్తిని మన్నించి ఆయనను కలిసేందుకు, పాదాలను తాకేందుకు అనుమతించారు. చాలా గర్వంగా భావిస్తున్నా" అని పర్సేకర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News