: భారత్ లో శామ్ సంగ్, సోనీ మొబైల్ ధరల తగ్గింపు


ప్రముఖ కంపెనీలు శామ్ సంగ్, సోనీలు భారత్ లో తమ మొబైల్ ధరలను తగ్గించాయి. ఈ క్రమంలో ఆ కంపెనీల మిడ్ రేంజ్ గెలాక్సీ గ్రాండ్ నియో, గెలాక్సీ గ్రాండ్ 2ల ధరలను తగ్గించింది. అటు సోనీ కూడా తన ఎక్స్ పీరియా జడ్ అల్ట్రా, ఎక్స్ పీరియా ఎం2 డ్యూయల్ స్మార్ట్ ఫోన్స్ ధరల్లోనూ తగ్గింపు ఇచ్చింది. దానికి సంబంధించి ముంబయికి చెందిన మహేష్ టెలికాం రిటైలర్ మాట్లాడుతూ, తగ్గిన ధరలు ఈ నెల 7 నుంచి అమలవుతాయని తెలిపారు. ఈ క్రమంలో గెలాక్సీ గ్రాండ్ నియో ధర రూ.16,990లకు, గెలాక్సీ గ్రాండ్2 రూ.12,590లకు తగ్గింది. అటు సోనీ ఎక్స్ పీరియా జడ్ అల్ట్రా ధర రూ.19,990కు, ఎక్స్ పీరియా ఎం2 డ్యుయెల్ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,990కు తగ్గింది.

  • Loading...

More Telugu News