: రఫెల్ నాదల్ కు త్వరలో స్టెమ్ సెల్ చికిత్స


ఇప్పటికే అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుని రఫెల్ నాదల్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ స్పానిష్ టెన్నిస్ ప్లేయర్ వెన్నునొప్పికి స్టెమ్ సెల్ చికిత్స తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని నాదల్ వ్యక్తిగత వైద్యుడు ఏంజెల్ రూయిజ్-కాటొర్రో తెలిపాడు. "అతని వెన్నెముక జాయింట్ లో సెల్స్ ను ఉంచేందుకు చికిత్స చేయనున్నాం. ఇందుకోసం వచ్చే వారం బార్సిలోనా వెళ్లాల్సి ఉంది" అని వివరించాడు. నాదల్ బ్యాక్ పెయిన్ ప్రత్యేకమైనదని, ఈ చికిత్స వల్ల అతని కార్టిలేజ్ (మృదులాస్థి)కు సాయపడుతుందనీ అన్నాడు. మళ్లీ తను ట్రైనింగ్ కు డిసెంబర్ లో తిరిగివస్తాడని తెలిపాడు.

  • Loading...

More Telugu News